గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 13:42:51

కొవిడ్‌ పరీక్షా వ్యూహాన్ని మార్చాం : సత్యేంద్ర జైన్‌

కొవిడ్‌ పరీక్షా వ్యూహాన్ని మార్చాం : సత్యేంద్ర జైన్‌

న్యూఢిల్లీ : కొవిడ్‌-19 పరీక్షల వ్యూహాన్ని ఢిల్లీ సర్కారు మార్చింది. పాజిటివ్‌ రోగుల కుటుంబ సభ్యులు, సన్నిహితులకు పరీక్షలు చేస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ గురువారం తెలిపారు. ఢిల్లీలో బుధవారం ఒకే రోజు 5,673 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 40 మరణాలు నమోదయ్యాయి. హాస్పిటళ్లలో పదివేల బెడ్లు ఖాళీగా ఉన్నాయి. పండుగలు, శీతాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యూహాన్ని మార్చామని సత్యేంద్ర జైన్‌ పేర్కొన్నారు. కుటుంబీకులను, రోగుల సన్నహిత పరిచయస్తులను పరీక్షిస్తున్నామని, దీంతో కేసుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ ప్రక్రియ ఇప్పుడు మరింత బలంగా మారాయని, దూకుడుగా ప్రత్యేక వ్యక్తులను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రతి కేసును గుర్తించడమే మా లక్ష్యమని, త్వరలోనే ఫలితాలు చూస్తామని చెప్పారు. ఢిల్లీల్లో థర్డ్‌ వేవ్‌ చూస్తున్నారా? అని ప్రశ్నించినప్పుడు.. విశ్లేషించడానికి కనీసం వారం రోజుల పాటు వేచి ఉండాలన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 29,378 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.