ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 15:17:02

మిడతల దండుపై ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర భేటీ

మిడతల దండుపై  ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర భేటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వైపు దూసుకువస్తున్న  మిడతల దండుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఉన్నతాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. మిడతల దండు రాష్ట్రానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

అత్యవసర సమావేశం అనంతరం మిడతల దండు దాడిని ఎదుర్కోవడానికి అడ్వైజరీని విడుదల చేస్తామని రాయ్‌ చెప్పారు.  గురుగ్రామ్‌కు సమీపంలోని పంట పొలాల్లో పర్యటించాలని ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులకు ఆయన సూచించారు. 

ఢిల్లీకి శివారులోని గురుగ్రామ్‌, తదితర సరిహద్దు జిల్లాల్లో  మిడదల దండు ఇప్పటికే వ్యాపించింది. పంటలను నాశనం చేసే మిడతల దండు శనివారం ఉదయమే గురుగ్రామ్‌కు చేరుకున్నది.  గురుగ్రామ్‌ సిటీతో పాటు ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో  మిడతలు వ్యాపిస్తున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  


logo