ఆదివారం 31 మే 2020
National - May 07, 2020 , 15:11:07

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం

న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తూ కరోనా వైరస్‌ బారినపడి మరణించిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి రూపాయల పరిహారంగా ఇవ్వనున్నట్లు కేజ్రివాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘కరోనా వైరస్‌ ప్రబలుతున్న సమయంలో కానిస్టేబుల్‌ అమిత్‌ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవచేశాడు. చివరికి ఆ మహమ్మారి బారినపడి మనల్ని వదిలి వెళ్లిపోయాడు. మన కోసం ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్‌ అమిత్‌కు నమస్సుమాంజలి ఘటిద్దాం. మన కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు పరిహారంగా అందిస్తాం’ అని కేజ్రివాల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  


logo