బుధవారం 08 జూలై 2020
National - Jun 27, 2020 , 20:18:47

పెరిగిన ఇంధన ధరలు.. కూరగాయలు, పండ్ల ధరపై ప్రభావం

పెరిగిన ఇంధన ధరలు.. కూరగాయలు, పండ్ల ధరపై ప్రభావం

న్యూఢిల్లీ : ఇరవైరోజులుగా నిత్యం పెట్రోల్‌ ధర పెరుగుతుండడంతో ఆ ప్రభావం కూరగాయలు, పండ్ల వ్యాపారాలపైనా పడింది. డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపుతో  ట్రాన్స్‌పోర్టర్లు ఛార్జీలు పెంచడంతో ఆహార పదార్థాల ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణాచార్జీలు పెంచడంతో వస్తువుల ధరలు పెరిగి మార్కెట్‌లో ధరలు చుక్కలనటడంతో కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాక వ్యాపారం తగ్గిందని ఢిల్లీ అజాంపూర్‌ మార్కెట్‌లోని ఓ కూరగాయల వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయిల్‌ మార్కెట్‌ సంస్థలు 21రోజులుగా ఇంధన ధరలు పెంచుతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సామాన్యులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 80.38పైసలకు చేరగా డీజిల్‌ ధర ఏకంగా 80.40పైసలకు చేరింది.


logo