శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 21:24:18

డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్‌

డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్‌

న్యూఢిల్లీ: గ‌త నెల‌లో డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ జ‌ర్వాల్‌, స‌హ నిందితుడు క‌పిల్ న‌గ‌ర్‌ల‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌కాశ్ జ‌ర్వాల్‌ను మొద‌ట ప్ర‌శ్నించ‌డానికి పిలిచి అనంత‌రం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేపై ఢిల్లీ కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. కేసు వివ‌రాల్లోకి వెళితే 52 ఏళ్ల రాజేంద్ర‌సింగ్ అనే వైద్యుడు ద‌క్ష‌ణ ఢిల్లీలోని దుర్గా విహార్‌లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న ఆత్మ‌హ‌త్య‌కు ఎమ్మెల్యే, క‌పిల్ న‌గ‌ర్‌లే కార‌ణ‌మంటూ సూసైడ్ నోట్‌లో రాశాడు. మృతుడి ఆరోప‌ణ‌ల మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. 


logo