సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 10:35:49

క‌రోనాతో డాక్ట‌ర్ మృతి... చికిత్స‌కు రూ.2 ల‌క్ష‌లు ఇచ్చిన‌ స‌హ‌చ‌రులు

క‌రోనాతో డాక్ట‌ర్ మృతి... చికిత్స‌కు రూ.2 ల‌క్ష‌లు ఇచ్చిన‌ స‌హ‌చ‌రులు

న్యూఢిల్లీ: క‌రోనాపై ముందుండి పోరాడిన ఓ డాక్ట‌ర్ చివ‌రికి అదే వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించాడు. అయితే అత‌నికి చికిత్స అందించిన ద‌వాఖాన రూ.3.4 బిల్లు వేసింది. కొడుకు మ‌ర‌ణంతో దుఃఖంలో ఉన్న తండ్రికి భార‌మెందుకు అనుకున్నారు ఆ డాక్ట‌ర్ స‌హ‌చ‌రులు. తామంతా కలిసి రూ.2,80,000 జ‌మ‌చేసి ఇచ్చారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలో జరి‌గింది. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సింగ్రౌలీకి చెందిన డా. జోగింద‌ర్ చౌదురి ఢిల్లీలోని డా.బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ద‌వాఖాన‌లో గ‌త న‌వంబ‌ర్ నుంచి ప‌నిచేస్తున్నారు. క‌రోనా విధుల్లో ఉన్న ఆ 27 ఏండ్ల డాక్ట‌ర్‌కు జూన్ 27న క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ ప్ర‌భుత్వ దావాఖాన‌లో చేరాడు. ప‌రిస్థి‌తి విష‌మించ‌డంతో అత‌ని కుటుంబ స‌భ్యులు శ్రీ గంగా రామ్ హాస్పిట‌ల్‌కు తీసుకుపోయారు. అయితే శ‌నివారం రాత్రి ఆ డాక్ట‌ర్ మ‌ర‌ణించాడు. ఈనేప‌థ్యంలో చికిత్స కోసం రూ.3ల‌క్ష‌ల 40 వేల బిల్లు చెల్లించాల‌ని గంగారాం ద‌వాఖా అధికారులు అత‌ని కుటుంబానికి తెలిపారు. 

ఈ విష‌యం తెలుసుకున్న అంబేద‌క్క‌ర్ ద‌వాఖాన వైద్యుల సంఘం రూ.2.8 ల‌క్ష‌లు జ‌మ‌చేసి ఆ 51 ఏండ్ల తండ్రికి ఇచ్చారు. అదేవిధంగా బిల్లును త‌గ్గించాల‌ని హాస్పిట‌ల్ వ‌ర్గాల‌ను కోరడంతో వారు కూడా స‌మ్మ‌తించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ మృతుని కుటుంబానికి రూ. కోటి ఆర్థిక స‌హాయంగా అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు.  ‌         


logo