సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 21:26:58

ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ డిప్యూటీ సీఎం

ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ డిప్యూటీ సీఎం

ఢిల్లీ : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా గురువారం అస్వస్థతకు గురయ్యారు. కరోనా బారినపడిన ఆయన ఈ నెల 14 నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఇవాళ ఉదయం జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో లోక్‌ నాయక్‌ హాస్పటల్‌లో చేరారు. ఆయనను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రాణాధారాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని, అవసరం అనుకుంటే వెంటిలేటర్‌పై ఉంచుతామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సిసోడియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo