శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 18:02:16

రేపే ఉరి.. స్టే ఇవ్వ‌ని ఢిల్లీ కోర్టు

రేపే ఉరి.. స్టే ఇవ్వ‌ని ఢిల్లీ కోర్టు

హైద‌రాబాద్‌:  నిర్భ‌య దోషుల‌ను ఉరి తీయ‌రాదు అంటూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ ఢిల్లీ హైకోర్టు తిర‌స్క‌రించింది.  నిర్భ‌య‌ను రేప్ చేసిన కేసులో న‌లుగురు దోషుల‌కు.. ముందుగా జారీ చేసిన డెత్ వారెంట్ ప్ర‌కారం మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కు ఉరి తీయాల్సి ఉన్న‌ది. అయితే ఆ ఉరిని ఆపాల‌ని వేసిన అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తిర‌స్క‌రించింది.  ఉరిని నిలిపివేయాల‌ని అక్ష‌య్‌కుమార్‌(31), ప‌వ‌న్ గుప్తా(25), ముకేశ్ సింగ్(32) పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ల‌ను ఇవాళ పాటియాలా కోర్టు తిర‌స్క‌రించింది.   నిందితుడు ప‌వ‌న్ గుప్తా పెట్టుకున్న క్యూరేటివ్ పిటిష‌న్‌ను ఇవాళ‌ సుప్రీం కొట్టివేసింది.  ఆ వెంట‌నే ఢిల్లీకోర్టు.. ఉరిశిక్ష వ‌ద్దంటూ వేసిన పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది.  అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి ధ‌ర్మేంద్ర రాణా ఈ తీర్పునిచ్చారు. ప‌వ‌న్ గుప్తా క్యూరేటివ్ పిటిష‌న్‌, అక్ష‌య్ కుమార్ క్ష‌మాభిక్ష పెండింగ్‌లో ఉన్న నేప‌థ్యంలో .. ఉరిని నిలిపివేయాల‌ని నిందితులు సుప్రీంను కోరారు.  దోషులంతా కోర్టు స‌మాయాన్ని వృధా చేశార‌ని, వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే య‌త్నం చేశార‌ని, రేపు వారిని క‌చ్చితంగా ఉరి తీస్తార‌ని నిర్భ‌య త‌ల్లి అన్నారు.  


logo