మంగళవారం 14 జూలై 2020
National - Jun 16, 2020 , 17:32:06

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విడాకులు మంజూరు

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విడాకులు మంజూరు

న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో వివాహాన్ని రద్దు చేసుకోవాలని భావించిన ఓ జంటకు ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విడాకులు మంజూరు చేసింది. 2017 జూన్‌లో పెండ్లైన దంపతులు 2018 డిసెంబర్‌ నుంచి విడిగా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే కరోనా నేపథ్యంలో కోర్టు వ్యవహారాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి దీపక్‌ గార్గ్‌ ఇద్దరి అభిప్రాయాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలుసుకున్నారు. ఆ మేరకు వారి నుంచి లిఖిత పూర్వక ప్రతాలను కూడా పొందారు. ఆ జంట కలిసి జీవించేందుకు ఇరువైపుల వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో విడాకులు మంజూరు చేస్తున్నట్లు మంగళవారం తీర్పు ఇచ్చారు. 
logo