శనివారం 06 జూన్ 2020
National - May 16, 2020 , 08:05:19

బ‌స్సులో 20 మందికి మాత్ర‌మే అనుమ‌తి..

బ‌స్సులో 20 మందికి  మాత్ర‌మే అనుమ‌తి..

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్-4 కోసం ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వానికి కొన్ని విజ్ఞ‌ప్తులు చేశాయి. అయితే ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది.  వాస్త‌వానికి మే 18వ తేదీ నుంచి కొత్త లాక్‌డౌన్ రూల్స్ అమ‌లులోకి రానున్నాయి. అయితే స‌డ‌లింపులు ఎలా ఉండాల‌న్న దానిపై సీఎం కేజ్రీవాల్‌.. కేంద్రానికి కొన్ని సూచ‌న‌లు చేశారు.  ఢిల్లీలో తిరుగుతున్న బ‌స్సుల్లో కేవ‌లం 20 మంది ప్ర‌యాణికుల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇవ్వాల‌ని సూచించారు.  ఇక ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 50 శాతం మించ‌కూడ‌ద‌ని కూడా సీఎం కేజ్రీవాల్ సూచించారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేర‌కు కూడా ఇదే విధానాన్ని అమ‌లు చేయ‌నున్నారు. ఢిల్లీ మెట్రోకు స్మార్ట్ కార్డులు జారీ చేయాల‌ని సూచించారు.  సీటింగ్ విష‌యంలో ఆల్ట‌ర్నేటివ్ ప‌ద్ధ‌తి అనుస‌రించాల‌న్నారు. క్యాబ్ స‌ర్వీసుల విష‌యంలోనూ కేజ్రీ స‌ల‌హాలు ఇచ్చారు.  కార్ పూలింగ్‌కు అనుమ‌తి లేద‌న్నారు. ఒక‌వేళ కేజ్రీ సూచ‌ల‌ను కేంద్రం అంగీక‌రిస్తే, అప్పుడు ఢిల్లీ బ‌స్సుల్లో కేవ‌లం 20 మంది ప్ర‌యాణికులు మాత్ర‌మే ఉండాల్సి ఉంటుంది.logo