శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 12:52:45

మే 17 త‌ర్వాత ఏం చేద్దాం.. ప్ర‌జాభిప్రాయం కోరుతున్న ఢిల్లీ సీఎం

మే 17 త‌ర్వాత ఏం చేద్దాం.. ప్ర‌జాభిప్రాయం కోరుతున్న ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విధించిన మూడో విడత‌ లాక్‌డౌన్ గ‌డువు మే 17న ముగియ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో మే 17 త‌ర్వాత ఢిల్లీలో లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌నే విష‌యమై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ మంత్రులు, అధికారుల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి కూడా అభిప్రాయాలు సేక‌రిస్తే బాగుంటుంద‌ని కేజ్రివాల్ భావించారు. అందులో భాగంగానే మే 17 త‌ర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోవాల‌నే విష‌యంలో అభిప్రాయాలు తెలియ‌జేయండంటూ అంద‌రికీ ఒక సందేశం చేర‌వేశారు. 

అభిప్రాయాలు ఇవ్వ‌ద‌లుచుకున్న వారు 1031 నెంబ‌ర్‌కు ఫోన్‌చేసి గానీ, 8800007722 వాట్సాప్ నెంబ‌ర్‌కు మెసెజ్ రూపంలోగానీ తెలుప‌వ‌చ్చ‌ని ఢిల్లీ సీఎం చెప్పారు. అదేవిధంగా ఈ మెయిల్ ద్వారా [email protected] అనే మెయిల్ ఐడీకీ కూడా ప్ర‌జ‌లు అభిప్రాయాలు పంప‌వ‌చ్చాన్నారు. అయితే ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాలు పంపేందుకు బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు గ‌డువు విధించారు ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌. ‌


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo