సోమవారం 01 జూన్ 2020
National - May 22, 2020 , 15:55:50

ఒడిశా, బెంగాల్‌కు మా మద్దతు ఉంటది: ఢిల్లీ సీఎం

ఒడిశా, బెంగాల్‌కు మా మద్దతు ఉంటది: ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ: అంఫాన్‌ తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌, ఒఢిశా రాష్ట్రాలకు తాము మద్దతుగా నిలుస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ తెలిపారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జికీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ఆయన సీంఘీభావం తెలియజేశారు. 

‘డియర్‌ మమతా దీదీ, అంఫాన్‌ తుఫాన్‌ కారణంగా బెంగాల్‌కు తీవ్ర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో మీకు, బెంగాల్‌ ప్రజలకు నాతోపాటు ఢిల్లీ ప్రజల తరఫున సంఘీభావం తెలుపుతున్నా. ఈ విపత్కర పరిస్థితుల్లో మీకు మేం మద్దతుగా నిలుస్తాం’అని కేజ్రివాల్‌ ట్విట్టర్లో పేర్కొన్నారు.

‘ఇక ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను ఉద్దేశించి కేజ్రివాల్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘డియర్‌ నవీన్ పట్నాయక్‌ తుఫాన్‌ ముప్పును ఎదుర్కొంటున్న మీకు, ఒడిశా ప్రజలకు నా తరఫున, ఢిల్లీ ప్రజల తరఫున సంఘీభావం తెలుపుతున్నా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీకు అన్ని విధాలుగా మా మద్దతు ఉంటుంది’ అని ఢిల్లీ సీఎం ట్వీట్‌ చేశారు.


logo