చేసిన ప్రతి సినిమాలోను ఎంతో కొంత వైవిధ్యతను చూపించి ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ! సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలు తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాగా సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు హను-మాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్భంగా ఆయన నాలుగో సినిమా మూవీ టైటిల్ మాత్రమే ప్రకటించిన మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన నటీనటుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఫిలిం నగర్ సమాచారం ప్రకారం తేజ సజ్జతోనే హను-మాన్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..!