బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:14:40

క‌రోనా ద‌వాఖాన‌ల నుంచి హోట‌ల్స్ డిటాచ్‌

క‌రోనా ద‌వాఖాన‌ల నుంచి హోట‌ల్స్ డిటాచ్‌

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా ప‌రిస్థితి మెరుగుప‌డుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో క‌రోనా ద‌వాఖాన‌ల‌కు అనుసంధానం చేసిన హోట‌ల్స్‌ను డిటాచ్ చేయ‌నున్న‌ట్లు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీనికి సంబంధించిన ఆదేశాల‌ను జారీ చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌రోవైపు క‌రోనా ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇటీవ‌ల జారీ చేసిన నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆరోగ్య‌శాఖ అధికారుల‌ను కేజ్రీవాల్ ఆదేశించారు. దీని ప్ర‌కారం క‌రోనా రోగుల‌కు నిర్వ‌హించిన యాంటిజెన్ ప‌రీక్ష‌లో నెగిటివ్‌గా వ‌చ్చిన‌ప్ప‌టికీ వారికి వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉంటే త‌ప్ప‌నిస‌రిగా ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష చేయాల‌ని సూచించారు. ఢిల్లీలో క‌రోనా కేసుల సంఖ్య 1.31 ల‌క్ష‌లు దాట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 3,853 మంది మ‌ర‌ణించారు.


logo