శనివారం 11 జూలై 2020
National - Jun 27, 2020 , 13:09:46

కరోనా కట్టడికి ఐదు ఆయుధాలు: సీఎం కేజ్రీవాల్‌

కరోనా కట్టడికి ఐదు ఆయుధాలు: సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: దేశ రాధాని ఢిల్లీలో కరోనా రోగుల కోసం 13500 పడకలు అందుబాటులో ఉన్నాయని  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. వాటిలో ఇప్పటికే 6500 పడకలు నిండాయని తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులు, పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మాట్లాడారు.   దవాఖానలను హోటళ్లకు అనుసంధానించామని వెల్లడించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఐదు విధానాలను సూచించారు. కరోనా రోగుల కోసం పడకల సామర్థ్యం పెంచాలని, కరోనా పరీక్షలు, ఐసోలేషన్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని చెప్పారు. అవసరమైన మేరకు ఆక్సీమీటర్లు అందుబాటులో ఉంచాలని, సర్వే, స్క్రీనింగ్‌, ప్లాస్మా థెరపీపై మరింత దృష్టిసారించాలని వెల్లడించారు. ఇవి ఢిల్లీలో కరోనా ఉధృతిని తగ్గించడానికి సహకరిస్తాయని తెలిపారు. 

ఢిల్లీలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని నాలుగింతలు పెంచామన్నారు. శుక్రవారం అత్యధికంగా 21,144 కరోనా పరీక్షలు చేశామన్నారు. కరోనా కేసుల్లో ఢిల్లీ ఇప్పటికే ముంబైని అధిగమించింది. ఢిల్లీలో ఇప్పటివరకు 77,240 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2492 మంది మృతిచెందారు.


logo