బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 02:41:43

‘షా’ రాజీనామా చేయాలి సోనియా గాంధీ డిమాండ్‌

‘షా’ రాజీనామా చేయాలి సోనియా గాంధీ డిమాండ్‌

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్‌ చేశారు. బుధవారం సోనియా నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఢిల్లీ అల్లర్లపై చర్చించి, తీర్మానం చేశారు. అనంతరం సోనియా మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లో జరుగుతున్న పరిణామాల వెనక ప్రణాళికాబద్ధమైన కుట్ర ఉన్నదని ఆరోపించారు. ‘ఢిల్లీ ఎన్నికలప్పుడు బీజేపీ నేతలు తమ ప్రసంగాలతో ప్రజల మధ్య విద్వేషం, భయానక వాతావరణాన్ని సృష్టించారు. బీజేపీ నేత కపిల్‌ మిశ్రా పోలీసులకు మూడు రోజులు గడువు ఇస్తున్నానంటూ రెచ్చగొ ట్టారు. అయినా ప్రభుత్వాలు మిన్నకుండిపోవడంతో 72 గంటల్లో 20 మందికిపైగా మరణించారు’ అని విమర్శించారు. ఆదివారం నుంచి అమిత్‌ షా ఎక్కడున్నారని ప్రశ్నించారు.  అనంతరం రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలని భావించినా.. గురువారం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంతో నేటికి వాయిదా వేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ నెల 28న రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరుతూ లేఖ రాశారు.


logo