గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 13:45:07

డ్రైనేజీలో ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ మృత‌దేహం

డ్రైనేజీలో ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ మృత‌దేహం

హైద‌రాబాద్‌: ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో శాఖ‌లో ప‌నిచేస్తున్న ఆఫీస‌ర్ చ‌నిపోయాడు.  ఈశాన్య ఢిల్లీలో అంకిత్ శ‌ర్మ అనే వ్య‌క్తి మృత‌దేహం ల‌భించింది.  ఓ డ్రైనేజీ నుంచి ఆఫీస‌ర్ శ‌వాన్ని వెలికితీశారు. సీఏఏకు వ్య‌తిరేకంగా జ‌రిగిన హింస‌లో ఇప్ప‌టికే 20 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది.  వంద‌ల సంఖ్య‌లో జ‌నం గాయ‌ప‌డ్డారు. ఢిల్లీ హింస అయిదో రోజుకు చేరుకున్న‌ది. అయితే తొలి రోజు జ‌రిగిన హింస‌లో ఓ పోలీసు ఆఫీస‌ర్ కూడా ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. 2017లో అంకిత్ డ్రైవ‌ర్‌గా.. ఐబీలో చేరాడు.  ప్ర‌స్తుతం అత‌ను సెక్యూర్టీ అసిస్టెంట్ ర్యాంక్‌లో ఉన్నాడు. 


logo