శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 17:46:10

బ‌కాయి జీతాల విడుద‌ల కోరుతూ వైద్యుల నిర‌స‌న‌

బ‌కాయి జీతాల విడుద‌ల కోరుతూ వైద్యుల నిర‌స‌న‌

ఢిల్లీ : బ‌కాయి జీతాల‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్ర‌భుత్వ వైద్యులు నిర‌స‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో చోటుచేసుకుంది. నార్త్ ఢిల్లీలోని ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు గురువారం జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. హిందూ రావు ఆస్ప‌త్రి, క‌స్తూర్భా హాస్పిట‌ల్‌, రాజెన్ బాబు టీబీ ఆస్ప‌త్రి వైద్యులు మాస్కులు ధ‌రించి ప్ల‌కార్డులు ప‌ట్టుకుని సంక్షోభాన్ని ప‌రిష్క‌రించాల్సిందిగా ఉన్న‌తాధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌లే వైద్యులు జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద‌ కొవ్వొత్తుల ర్యాలీని కూడా చేప‌ట్టారు. సమ‌స్య‌ల‌పై విజ్ఞ‌ప్తులు చేసి చేసి అలిసిపోయాం. ప‌రిష్కారం మాత్రం క‌నిపించ‌డం లేద‌న్నారు.

ఆస్ప‌త్రుల్లో ఉండాల్సిన వాళ్లం. డిమాండ్ల సాధ‌న‌కు ఒత్తిడి చేయ‌డం త‌ప్ప త‌మ‌కు వేరే మార్గం లేకుండా పోయింద‌ని ప‌లువురు వైద్యులు పేర్కొన్నారు. త‌గిన జీతాలు అంద‌డం అనేది త‌మ ప్రాథ‌మిక హ‌క్కు అన్నారు. ఆందోళ‌న‌పై నార్త్ ఢిల్లీ మేయ‌ర్ జై ప్ర‌కాష్ స్పందిస్తూ.. రెసిడెంట్ వైద్యుల‌కు జులై నెల జీతాలు విడుద‌లైన‌ట్లు చెప్పారు. నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను బీజేపీ నియంత్రిస్తుంద‌ని ఆప్ అంటుండ‌గా ఆప్ ప్ర‌భుత్వం వ‌ల్లే ఈ ఇబ్బందుల‌ని బీజేపీ ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తోంది.