మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 12:42:57

డీజిల్‌పై వ్యాట్‌ను త‌గ్గించిన ఢిల్లీ ప్ర‌భుత్వం

డీజిల్‌పై వ్యాట్‌ను త‌గ్గించిన ఢిల్లీ ప్ర‌భుత్వం

న్యూఢిల్లీ: డీజిల్‌పై వ్యాట్‌ను ఢిల్లీ ప్ర‌భుత్వం త‌గ్గించింది. ఈ మేర‌కు త‌మ‌ క్యాబినెట్ నిర్ణ‌యించిన‌ట్లు ఢీల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ గురువారం తెలిపారు. డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను 30 నుంచి 16.75 శాతానికి త‌గ్గిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. దీంతో ఢిల్లీలో లీట‌రు రూ.82 ఉన్న డీజిల్ ధ‌ర రూ.73.64కు త‌గ్గుతుంద‌ని చెప్పారు.  త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వ‌ల్ల వాహ‌న వినియోగ‌దారుల‌కు డీజిల్‌పై లీట‌ర‌కు రూ.8.36 మేర ఆదా అవుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

ఢిల్లీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్రారంభించిన జాబ్ పోర్ట‌ల్‌కు విశేష స్పంద‌న వ‌స్తున్న‌ద‌ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. వారం రోజుల్లోనే సుమారు 7,577 కంపెనీలు రిజిష్ట‌ర్ చేసుకున్నాయ‌ని చెప్పారు. 2,04,785 ఉద్యోగాల కోసం ఆ సంస్థ‌లు ఈ జాబ్ పోర్ట‌ల్‌లో పేర్కొన్నాయ‌న్నారు. ఉద్యోగాల కోసం 3,22,865 మంది త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నార‌ని కేజ్రీవాల్ వెల్ల‌డించారు.logo