ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 13:40:54

ఢిల్లీ విమానం.. క‌రాచీలో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

ఢిల్లీ విమానం.. క‌రాచీలో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

హైద‌రాబాద్‌: రియాద్ నుంచి ఢిల్లీ వ‌స్తున్న గో ఎయిర్ విమానాన్ని మంగ‌ళ‌వారం అత్య‌వ‌స‌రంగా పాకిస్థాన్‌లోని క‌రాచీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో ఉన్న ఓ ప్ర‌యాణికుడికి గుండెపోటు రావ‌డంతో.. విమానాన్ని క‌రాచీలో దింపాల్సి వ‌చ్చిన‌ట్లు ఎయిర్‌లైన్స్ అధికారి ఒక‌రు తెలిపారు.రియాద్ నుంచి వ‌స్తున్న జీ8-6658 విమానం ఇవాళ ఉద‌యం ఢిల్లీ విమానాశ్ర‌యం చేరుకున్న‌ది.  గుండెపోటు వ‌చ్చిన ప్ర‌యాణికుడిని ఆదుకునేందుకు వీలైనంత వ‌ర‌కు వైద్య సాయం చేశారు. కానీ క‌రాచీ డాక్ట‌ర్లు ఆ ప్ర‌యాణికుడు మ‌ర‌ణించిన‌ట్లు ద్రువీక‌రించారు.  ఆ విమానంలో 179 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఎయిర్‌లైన్స్ సంస్థ దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేయాల్సి ఉన్న‌ది. 


తాజావార్తలు