ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 13:20:00

ఢిల్లీ బీజేపీ చీఫ్‌కు క‌రోనా పాజిటివ్‌

ఢిల్లీ బీజేపీ చీఫ్‌కు క‌రోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: ‌ఢిల్లీ బీజేపీ అధ్య‌క్షుడు అదేశ్ గుప్తాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. త‌న‌లో కొన్ని క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింద‌ని ఆయ‌న తెలిపారు. అందువ‌ల్ల ఇటీవ‌ల త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని గుప్తా కోరారు. ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ వ‌చ్చినా, రాక‌పోయినా అంద‌రూ హోంక్వారెంటైన్‌లో ఉండాల‌ని సూచించారు. 

'గ‌త వారం స్వ‌ల్పంగా జ్వ‌రం ఉండ‌టంతో క‌రోనా పరీక్ష‌లు చేయించుకున్నా. అయితే ఫ‌లితం నెగెటివ్ అని వ‌చ్చింది. అయితే, ఆ త‌ర్వాత కూడా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుప‌డ‌క‌పోవ‌డంతో మ‌రోసారి ప‌రీక్ష‌లు చేయించా. ఈ సారి పాజిటివ్ వ‌చ్చింది' అని అదేశ్ గుప్తా పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo