గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 08:34:44

ఢిల్లీకి రాజెవరో తేలేది నేడే!

ఢిల్లీకి రాజెవరో తేలేది నేడే!
  • ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను కలుగజేసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. 70 స్థానాలకు శనివారం జరిగిన ఈ ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపు కోసం 21 కౌంటింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ భద్రతా సిబ్బందిని మోహరించింది. కౌంటింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లో ఫలితాల సరళి, పార్టీల ఆధిక్యత తెలిసే అవకాశం ఉన్నది. కాగా శనివారం పోలింగ్‌ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌  సర్వేల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) తిరిగి అధికారంలోకి రానున్నట్టు వెల్లడైంది. అయితే, ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 48 సీట్లు రావడం ఖాయమని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ పేర్కొనడం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ క్రమంలో మంగళవారం విడుదలయ్యే ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది.


logo