మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 17:01:26

క‌రోనాతో ఏఎస్ఐ మృతి

క‌రోనాతో ఏఎస్ఐ మృతి

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ ఏఎస్ఐ క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు ఢిల్లీ పోలీసు ఉన్న‌తాధికారులు ధృవీక‌రించారు. ఢిల్లీ పోలీసు స్పెష‌ల్ బ్రాంచ్ లో ఏఎస్ఐగా విధులు నిర్వ‌ర్తిస్తున్న జీవ‌న్ సింగ్ కు జూన్ 21న క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

దీంతో 23వ తేదీన ఐబీఎస్ ల‌జ‌ప‌త్ న‌గ‌ర్ ద‌వాఖానాలో చేరారు. 27న గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్ల‌వారుజామున 4:30 గంట‌ల‌కు జీవ‌న్ సింగ్ తుదిశ్వాస విడిచారు. కరోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ పోలీసు విభాగంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 వేల మంది పోలీసులకు క‌రోనా సోక‌గా, 1300ల మంది కోలుకున్నారు. 

ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,04,864 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 3,213 మంది మ‌ర‌ణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 23,452 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ వైర‌స్ నుంచి 78,199 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo