మంగళవారం 19 జనవరి 2021
National - Dec 07, 2020 , 16:44:02

బంగారం స్మ‌గ్లింగ్‌.. ఎయిర్‌లైన్ ఉద్యోగి అరెస్ట్‌

బంగారం స్మ‌గ్లింగ్‌.. ఎయిర్‌లైన్ ఉద్యోగి అరెస్ట్‌

న్యూఢిల్లీ: సాధార‌ణంగా స్మ‌గ్లింగ్ ముఠాలు విదేశాల నుంచి అక్ర‌మంగా భార‌త్‌కు త‌ర‌లిస్తుంటాయి. ఇలా అక్ర‌మంగా బంగారాన్ని త‌రలిస్తూ ప్ర‌తిరోజు ఎక్క‌డో ఒక‌చోట నిందితులు ప‌ట్టుబడుతూనే ఉన్నారు. కానీ, తాజాగా ఎయిర్ లైన్స్ క్రూ మెంబ‌ర్ కూడా బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డ్డాడు. ఢిల్లీ క‌స్ట‌మ్స్ అధికారులు ఒక ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని, క్యాట‌రింగ్ కంపెనీకి చెందిన మ‌రో ఉద్యోగిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 3.117 కిలోల దొంగ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ.1.3 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.