శుక్రవారం 03 జూలై 2020
National - Jun 23, 2020 , 16:01:41

త్రీడీ ప్రింటర్‌తో ఫేస్‌ షీల్డ్స్‌‌, మాస్కులు తయారీ

త్రీడీ ప్రింటర్‌తో ఫేస్‌ షీల్డ్స్‌‌, మాస్కులు తయారీ

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో తాను కూడా ఏదైనా చేయాలని భావించాడు ఓ విద్యార్థి. త్రీడీ ప్రింటర్‌ సహాయంతో ఫేస్‌ షీల్డ్స్‌, మాస్కులు తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఢిల్లీకి చెందిన పదో తరగతి విద్యార్థి. దీని కోసం ఓ త్రీడీ ప్రింటర్‌ను అతడు కొనుగోలు చేశాడు. దీని ద్వారా ఇంటి వద్దనే ఫేస్‌ షీల్డ్స్‌, మాస్కులు తయారు చేస్తున్నాడు. తాను తయారు చేసిన వంద ఫేస్‌ షీల్డ్స్‌ను సోమవారం ఢిల్లీ పోలీసులకు అందజేశాడు. కరోనాపై పోరాటంలో ముందున్న వారిలో కీలకమైన పోలీసులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆ విద్యార్థి తెలిపాడు. అవసరమైన వారికి కూడా వీటిని ఉచితంగా అందిస్తానని అతడు పేర్కొన్నాడు. logo