బుధవారం 08 జూలై 2020
National - Jun 15, 2020 , 12:38:11

క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌ధాని చ‌ర్య‌లు భేష్‌: రాజ్‌నాథ్‌సింగ్

క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌ధాని చ‌ర్య‌లు భేష్‌: రాజ్‌నాథ్‌సింగ్

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం రాజ్‌నాథ్ సింగ్ తీసుకుంటున్న చ‌ర్య‌లు భేషూగ్గా ఉన్నాయ‌ని ఆయ‌న కొనియాడారు. క‌రోనా ర‌క్క‌సివ‌ల్ల ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయ‌ని, కానీ కేంద్ర‌ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకున్న ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌వ‌ల్ల దేశంలో ప‌రిస్థితి ఇప్ప‌టికీ అదుపులో ఉంద‌ని రాజ్‌నాథ్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి నిర్మూల‌న కోసం కేంద్రం చేప‌ట్టిన చ‌ర్య‌లు దేశీయంగానేకాక‌, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్ర‌శంస‌లు పొందాయ‌ని రాజ్‌నాథ్ తెలిపారు. ప్ర‌ధాని మోదీ సంక‌ల్ప బ‌ల‌న్ని తాను అభినందిస్తున్నాన‌ని చెప్పారు. అదేవిధంగా, 2013లో ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 9వ స్థానంలో ఉంద‌ని, ఇప్పుడు మొద‌టి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టిగా భారత ఆర్థిక వ్య‌వ‌స్థ నిలిచిందని ఆయ‌న తెలిపారు. అయితే, ప్ర‌పంచంలోని మొద‌టి మూడు అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టిగా భారత ఆర్థిక వ్య‌వ‌స్థ నిలువాల‌న్న‌దే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని రాజ్‌నాథ్ చెప్పారు.  ‌


logo