మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 15:25:57

అమర్‌నాథ్‌ సందర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

అమర్‌నాథ్‌ సందర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

శ్రీనగర్ : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల లడఖ్, జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. మొదటి రోజు లేహ్‌లో గడిపిన రక్షణ మంత్రి జమ్ముకశ్మీర్‌లో ఉన్నారు. అక్కడ నుంచి బాబా అమర్‌నాథ్‌ను దర్శించుకునేందుకు పవిత్ర గుహకు చేరుకున్నారు. ఇక్కడ దాదాపు ఒక గంట గడిపారు. ప్రత్యేక పూజలు చేశారు. రక్షణ మంత్రి వెంట చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే కూడా పవిత్రగుహలో అమర్ నాథ్ లింగాన్ని దర్శించుకున్నారు. అనంతరం నియంత్రణ రేఖలోని కుప్వారా వద్ద ఆర్మీ ఫార్వర్డ్ పోస్టుకు చేరుకున్నాడు.

అంతకుముందు, రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం లేహ్ కు చేరుకున్నారు. అక్కడ ఆర్మీ, వైమానిక దళం యుద్ధ నైపుణ్యాలను చూడటమే కాకుండా, చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అగ్రిమ్ అవుట్ పోస్టుకు వెళ్లి సైనికులను ప్రోత్సహించాడు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) చైనా ఆక్రమణపై వివాదం మధ్య రక్షణ మంత్రి శుక్రవారం లేహ్-లడఖ్‌లోని లుకుంగ్ మిలిటరీ ఔట్‌పోస్టును సందర్శించారు. వీరి పర్యటన సరిహద్దుల్లో మోహరించిన దళాల మనోధైర్యాన్ని పెంచింది.


logo