మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 07:29:38

వ్యూహాత్మక ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం.. జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి

వ్యూహాత్మక ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం.. జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి

న్యూఢిల్లీ : లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 43 వంతెనలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వెళ్లే మార్గంలో నెచిఫూ టన్నెల్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ ఓ) తయారు చేసిన 43 వంతెనలను జాతికి అంకితం చేయనున్నారు. వంతెనల్లో 10 జమ్మూ కాశ్మీర్‌లో, హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎనిమిది, సిక్కిం, పంజాబ్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

లడఖ్‌లో సహా ఏడు సహా 43 వంతెనల్లో చాలా వరకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్నాయని, సైనిక దళాలు, ఆయుధాల వేగంగా కదలడానికి సాయపడతాయి రక్షణశాఖ అధికారులు తెలిపారు. సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) తూర్పు లడఖ్‌లో భారత్‌, చైనా మధ్య ఘర్షణకు దారిన తీసిన క్రమంలో నిర్మాణాలను వేగవంతం చేస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం మధ్య.. భారతదేశం హిమాచల్‌ ప్రదేశేలో డార్చాతో లడఖ్‌ను కలిసే వ్యూహాత్మక రహదారితో సహా పలు కీలక ప్రాజెక్టుల పనులను వేగిరం చేసింది. దాదాపు 290 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి లడఖ్ ప్రాంతంలోని సరిహద్దు స్థావరాలలోకి బలగాలు, భారీ ఆయుధాల తరలింపుకు కీలకంగా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo