మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 15:14:17

సైన్యాధికారుల‌తో ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌పై రాజ్‌నాథ్ స‌మీక్ష‌

సైన్యాధికారుల‌తో ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌పై రాజ్‌నాథ్ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌:  ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో ఉన్న ప‌రిస్థితిపై ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ స‌మ‌గ్ర స్థాయిలో స‌మీక్ష జ‌రిపారు.  సైనిక ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న భేటీ నిర్వ‌హించారు.  వివాదాస్ప‌ద ప్రాంతం నుంచి చైనా ద‌ళాలు ఉప‌సంహ‌రించిన అంశం గురించి అడిగి తెలుసుకున్నారు.  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే, నేవీ చీఫ్ అడ్మిర‌ల్ కరంబీర్ సింగ్‌, ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఆర్‌కేఎస్ భ‌దౌరియాలు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

గాల్వ‌న్ లోయ నుంచి ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి జ‌న‌ర‌ల్ న‌ర‌వాణే.. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌కు స‌వివ‌రంగా విష‌యాల‌ను వెల్ల‌డించారు.  గోగ్రా, హాట్ స్ప్రింగ్స్‌, ఫింగ‌ర్ 4, పాన్‌గాంగ్ సో లాంటి కీల‌క ప్రాంతాల నుంచి కూడా ద‌ళాలు వెన‌క్కి వెళ్లిన‌ట్లు జ‌న‌ర‌ల్ న‌ర‌వాణే తెలిపారు. గాల్వ‌న్ లోయ‌లో మూడు కిలోమీట‌ర్ల మేర బ‌ఫ‌ర్ జోన్‌ను క్రియేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 


 


logo