ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 12:30:33

రక్షణ దళాధిపతులతో.. రాజ్‌నాథ్ సింగ్ భేటీ

రక్షణ దళాధిపతులతో.. రాజ్‌నాథ్ సింగ్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ త్రివిధ దళాధిపతులతో బుధవారం సమావేశమయ్యారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌స్టాఫ్‌ (సీవోడీ) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్ ముకుంద్ నారవణే, నేవీ చీఫ్‌ అడ్మిరల్ కరంబీర్ సింగ్, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదౌరియా ఇందులో పాల్గొన్నారు. లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య మంగళవారం జరిగిన ఘర్షణలో 20 మంది సైనికుల వీర మరణం, అనంతర పరిస్థితుల గురించి రాజ్‌నాథ్‌ వారితో చర్చించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తోనూ రాజ్‌నాథ్ సింగ్‌ మాట్లాడారు. భారత్‌, చైనా సైనికుల మధ్య ముఖాముఖి ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై ఆయన చర్చించినట్లు తెలుస్తున్నది. 


logo