ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 15:51:30

డార్జిలింగ్‌కు ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌

డార్జిలింగ్‌కు ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌

కోల్‌క‌తా‌: ‌భార‌త రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డార్జిలింగ్‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. రెండు రోజుల‌పాటు పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో పర్యటించనున్న ఆయ‌న‌.. శనివారం న్యూఢిల్లీ నుంచి బయల్దేరారు. న్యూఢిల్లీ నుంచి ముందుగా ఆయన డార్జిలింగ్‌కు వెళ్తారు. అక్క‌డ‌‌ ఫార్వర్డ్ ఏరియాస్‌లోని భద్రతా దళాలతో  మాట్లాడతారు. ఆ త‌ర్వాత‌ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిక్కింలో నిర్మించిన రోడ్డును ప్రారంభిస్తారు. ఈ ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను రాజ్‌నాథ్‌సింగ్ స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. 

కాగా, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ సైన్యంతో పోరాటానికి సిద్ధంగా ఉన్న భార‌త సైన్యంలో ఆత్మవిశ్వాసం పెంచే ఉద్దేశంతో రాజ్‌నాథ్ ప‌ర్య‌టిస్తున్నారు. చైనా సరిహద్దుల్లోని సిక్కింలో ఉన్న స్థానిక భద్రతా దళాల స్థావరంలో దసరా సందర్భంగా ఆయన శస్త్ర పూజ చేసే అవకాశం కూడా ఉంది. గత ఏడాది ఆయన రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించినపుడు కూడా ఫ్రాన్స్‌లో ఆయుధ పూజ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.