శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 12:45:12

కఠిన పరిస్థితుల్లో ఐఏఎఫ్ పాత్ర ఎనలేనిది: రాజ్‌నాథ్ సింగ్

కఠిన పరిస్థితుల్లో ఐఏఎఫ్ పాత్ర ఎనలేనిది: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: కఠిన పరిస్థితుల్లో భారత వాయుసేన (ఐఏఎఫ్) పాత్ర ఎనలేనిదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలయమైన వాయుభవన్‌లో మూడు రోజులపాటు జరుగనున్న ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్‌తో పలు అంశాలపై మాట్లాడారు. కరోనాపై దేశం చేస్తున్న పోరాటంలో భారత వాయుసేన సహకారం ఎంతో ప్రశ్రంసనీయమని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.

"తదుపరి దశాబ్దంలో భారత వైమానిక దళం" అనే థీమ్‌తో ప్రారంభమైన ఎయిర్‌ఫోర్స్ కమాండర్ల సదస్సుకు భారత వాయు‌సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా అధ్యక్షత వహించారు. రక్షణ శాఖ,  రక్షణ ఉత్పత్తి కార్యదర్శలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కమాండర్ల కార్యాచరణ, వచ్చే దశాబ్దంలో ఐఏఎఫ్ సామర్థ్యాన్ని పెంచే చర్యలపై మూడు రోజుల సదస్సులో చర్చిస్తారు. తూర్పు లఢక్‌లోని సరిహద్దు వద్ద  భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో ఎయిర్‌ఫోర్స్ కమాండర్ల సదస్సు జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది.
logo