బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 20:28:36

ఆకుల‌ కోసం 7 అడుగుల ఎత్తు నిల‌బ‌డిన జింక‌.. వెనుక‌కాళ్ల‌పైనే అంత‌సేపు!

ఆకుల‌ కోసం 7 అడుగుల ఎత్తు నిల‌బ‌డిన జింక‌.. వెనుక‌కాళ్ల‌పైనే అంత‌సేపు!

చెట్టు నుంచి ఆకులు, పండ్లు కోసుకొని తిన‌డానికి ఒక జింక వెనుక కాళ్ళ‌పై నిల‌బ‌డి మ‌రీ సాధించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఈ వీడియోను ఐఎఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 'ఈ వీడియో అంద‌రినీ న‌వ్విస్తుంది. 5-7 అడుగులు ఉండే ఎత్తైన చెట్టు కొమ్మ‌ను అందుకోవ‌డానికి జింక వెనుక కాళ్ల‌పై నిల‌బడ‌గ‌ల‌వు' అనే శీర్షిక‌ను జోడించింది.

38 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో ప‌చ్చ‌టి చెట్ల మ‌ధ్య‌ పెద్ద జింక‌ల‌ను మేపుతున్న‌ట్లు క‌నిపించింది. ఈ దృశ్యం అంద‌రినీ మంత్ర‌ముగ్దుల్ని చేస్తుంది. 'అందంగా బంధించ‌బ‌డింది' అని ఒక యూజ‌ర్ కామెంట్ పెట్టారు. 'వావ్ అద్భుత‌మైన‌ది' అంటూ మ‌రొక యూజ‌ర్ కామెంట్ చేశారు. 


logo