ఆదివారం 31 మే 2020
National - May 10, 2020 , 19:50:44

పైనుండి ఇంట్లో పడిన జింక

పైనుండి ఇంట్లో పడిన జింక

ముంబాయ్‌లోని పోవాయి ప్రాంతంలో ఓ ఇంట్లో హఠాత్తుగా ఓ జింక పై కప్పు పగులగొట్టుకుని ఇంట్లో పడింది. ఇంట్లో వారు పెద్ద శభ్దం రావడంతో బయపడి లేచి చూసేసరికి ఇంట్లో ఓ మూలకు వెళ్ళి హాయిగా కూర్చుంది ఆ మచ్చల జింక. అయితే దగ్గరలోని సంజయ్‌ గాంధీ నేషనల్‌ పార్కు సమీపంలోని మహాత్మా పూలే చాల్‌లోని ఎత్తైన ప్రాంతం నుంచి ఒక చిరుత ఈ జింకను వేటాడుతూ అది పరుగెత్తుతూ తప్పించుకునే క్రమంలో ఓ ఇంటిపై ఎక్కడంతో ఆ ఇంటి పై కప్పు కూలి జింక తన ప్రాణాలను కాపాడుకుంది.

షాక్‌లోకి వెళ్ళిన జింక కాసేపు అక్కడ నుండి కదల్లేదట. జింకకు స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లు అటవీ శాక అధికారులు గుర్తించారు. ఇక జనావాసాల్లోకి రాకుండా చిరుత అటవీ ప్రాంతంలోకే వెళ్ళిందని స్థానికులు చెబుతున్నారు. తరచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు, జింకలు జనావాసాల్లోకి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ జింక వీడియో, ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.


logo