సోమవారం 13 జూలై 2020
National - Jun 30, 2020 , 18:29:51

నదిలో చిక్కుకున్న జింక.. కాపాడిన ఫారెస్టర్‌.. వీడియో వైరల్‌

నదిలో చిక్కుకున్న జింక.. కాపాడిన ఫారెస్టర్‌.. వీడియో వైరల్‌

మూగజీవాలను హింసించి చంపే క్రూరులున్న ఈ రోజుల్లో వాటికి ఆపద వస్తే ఆదుకునే మంచి మనసున్న మానవులు కూడా ఉన్నారని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఒక వ్యక్తి నదిలో చిక్కుకున్న జింకను తాడు సాయంతో వేలాడుకుంటూ నదిలోకి దిగి దాని ప్రాణాలు కాపడిన వీడియోను ఐఎఫ్ఎస్ రమేష్ పాండే ట్విట్టర్‌ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. 

గంగా బ్యారేజీలోని నది చిత్తడి నేలలో జింక చిక్కుకుంది. దాన్ని కాపాడటానికి హైదర్‌పూర్‌కు చెందిన ఫారెస్టర్‌ మోహన్ యాదవ్ సహోద్యోగి సాయంతో నడుముకు తాడు కట్టుకొని నదిలోకి దిగాడు. నీటిలో పేరుకుపోయిన చెత్తలో చిక్కుకున్న జింకను ఓ వైపుకు మెల్లగా లాగుతూ దాన్ని సురక్షితంగా బయటకు తీశాడు. జింకను రక్షించే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఫారెస్టర్ మోహన్ యాదవ్ ధైర్యం చేసి జింకను కాపాడాడని అందరూ అభినందిస్తున్నారు. అయితే ఈ వీడియో కేవలం 1 నిమిషం నిడివి మాత్రమే ఉంది పూర్తి వీడియోను అప్‌లోడ్ చేయాలని ప్రజలు ఐఎఫ్‌ఎస్ రమేష్ పాండేని కోరుతున్నారు. logo