బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 10:09:56

పాకిస్థానీ ముసారత్‌ సూచన మేరకే

పాకిస్థానీ ముసారత్‌ సూచన మేరకే

  • దీపిక జేఎన్‌యూను సందర్శనపై మాజీ రా అధికారి సూద్‌ ఆరోపణ

న్యూఢిల్లీ: పాకిస్థానీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అనీల్‌ ముసారత్‌ సూచనల మేరకే ఆమె జేఎన్‌యూలో లెఫ్ట్‌ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనను సందర్శించారని ‘రా’ మాజీ అధికారి ఎన్కే సూద్‌ ఆరోపించారు. ఇందుకోసం అనీల్‌ ముసారత్‌ నుంచి దీపికకు రూ.5 కోట్లు ముట్టాయని చెప్పారు. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులతో ఆయనకు సంబంధాలున్నాయని, 2018 మేలో జరిగిన సోనం కపూర్‌ వివాహ వేడుకలో పాల్గొన్నాడని తెలిపారు. ఈ నెల 24న విడుదల చేసిన మరో వీడియోలో 2017 సెప్టెంబర్‌లో జరిగిన అనీల్‌ ముసారత్‌ కూతురు అనూష పెండ్లికి బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహర్‌, హృతిక్‌ రోషన్‌ తదితరులు హాజరయ్యారని చెప్పారు. 


logo