శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 12:57:01

తూగుతున్న ఏనుగును క‌దిలించ‌గానే.. పాపం కింద ప‌డిపోయింది!

తూగుతున్న ఏనుగును క‌దిలించ‌గానే.. పాపం కింద ప‌డిపోయింది!

చిన్న‌ప్ప‌డు స్కూల్‌లో చ‌దువుకునేట‌ప్పుడు మ‌ధ్యాహ్నం భోజనం చేసి క్లాస్‌లో కూర్చుంటే చాలు. నిద్ర ముంచుకొస్తుంది. పాఠం చెబుతూనే ఉంటారు. తూగుతూనే ఉంటాం. నిద్ర‌మ‌త్తులో కింద ప‌డినా ఆశ్చ‌ర్యం లేదు. ఇప్పుడు ఈ ఏనుగు పిల్ల కూడా అలానే తూగుతున్న‌ది. కాక‌పోతే నిల‌బ‌డి నిద్ర‌పోతున్న‌ది.

ప‌క్క‌నే ఉన్న త‌ల్లి ఏనుగు కాలు త‌గ‌ల‌గానే పాపం నిద్ర‌పోతున్న పిల్ల ఏనుగు కింద‌ప‌డి ప‌ల్టీలు కొట్టింది. దీంతో దెబ్బ‌కి నిద్ర‌మ‌త్తు మాయ‌మైంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు పాపం అనిపించినా భ‌లే నివ్వొస్తుంది. దీనిని ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన కాసేప‌టికే వైర‌ల్‌గా మారింది. 


logo