సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 09:41:58

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు నిత్యం 50వేల నుంచి 60వేలకుపైగా పాజిటివ్‌ నమోదు అవుతుండగా.. తొలిసారిగా గడిచిన 24గంటల్లో 49,881 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 80లక్షల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 80,40,203కు చేరాయి. తాజాగా 517 మంది మహమ్మారి కారణంగా మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,20,527కి చేరింది. గత 24గంటల్లో 56,480 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 73,15,989 మంది కోలుకోగా 6,03,678 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. బుధవారం ఒకే రోజు 10,75,760 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 10,65,63,440 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.