శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 18:13:06

చండీగఢ్‌లో తగ్గిన కరోనా ప్రభావం

చండీగఢ్‌లో తగ్గిన కరోనా ప్రభావం

  • తాజాగా 25 కేసులు నమోదు

చండీఘర్‌ : చండీగఢ్‌లో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 25 కరోనా కేసులు నమోదు కాగా  ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 660కి చేరగా అందులో 169 మంది మాత్రమే దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 480 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 11 మంది మాత్రమే కరోనాతో మృతి చెందినట్లు రాష్ర్ట ఆరోగ్య సంస్థ తెలియజేసింది. 

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో దేశంలో 34,956 కేసులు నమోదు కాగా 687 మంది మృతిచెందారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య శుక్రవారం 10 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం మొత్తం 10,03,832 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో 3,42,473 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 6,35,757 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 25,602 మంది మృతిచెందారు. 


తాజావార్తలు


logo