గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 03:09:30

అనుమానాస్పద స్థితిలో కుటుంబం మృతి

అనుమానాస్పద స్థితిలో కుటుంబం మృతి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతం భజన్‌పురలో ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ-రిక్షా డ్రైవర్‌ శంభూచౌదరి (43) ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిబయట వేసిన తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. ఇంటిలోపల ఇద్దరు పెద్దలు, ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉన్నాయని, అవి బాగా కుళ్లిపోయాయని చెప్పారు. పోస్ట్‌మార్టం తర్వాతే వారి మృతి కారణాలు తెలుస్తాయన్నారు. ఇంటిలో ఎటువంటి ఆయుధం వంటిది దొరకలేదని, దోపిడీ జరుగలేదన్నారు. బీహార్‌కు చెందిన శంభు చౌదరి ఈ ప్రాంతంలో ఈ-రిక్షాను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

logo