గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 14:38:12

హిమాచల్‌ప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

హిమాచల్‌ప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

షిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా అక్కడ గడిచిన 24 గంటల్లో 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1641కు చేరింది. అందులో కేవలం 547 కేసులు మాత్రమే దవాఖానలో చికిత్స పొందుతుండగా 1067 మంది కరోనా బారి నుంచి బయటపడి దవాఖాన నుంచి డిశ్చార్జి అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. ఇప్పటివరకు కేవలం 11 మంది మాత్రమే అక్కడ మరణించినట్లు తెలిసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo