బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 10:13:18

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు : కేజ్రీవాల్‌

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని అక్కడి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు, ప్రజలు కలిసి ఈ విజయం సాధించారన్నారు. కానీ కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదన్నారు. బురారీలో ఏర్పాటు చేసిన 450 పడక దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెర్స్‌లో మాట్లాడారు.

దేశ రాజధానిలో కరోనా కేసులు, మరణాల సంఖ్ తగ్గిందన్నారు. రికవరీ రేటు కూడా పెరిగిందన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు లక్ష 28 వేలకు చేరగా.. దవాఖానలో చికిత్సపొందుతున్న వారి సంఖ్య 14 వేల మంది ఉన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo