ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 18:03:06

వైద్యుల దినోత్సవాన్ని సెలవురోజుగా కేంద్రం ప్రకటించాలి..

వైద్యుల దినోత్సవాన్ని సెలవురోజుగా కేంద్రం ప్రకటించాలి..

కోల్‌కతా: వైద్యుల దినోత్సవమైన జూలై 1ని సెలవు రోజుగా కేంద్రం ప్రకటించాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. కరోనాపై పోరాటంలో ముందున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది గౌరవార్ధం వైద్యుల దినోత్సమైన జూలై 1ని తమ రాష్ట్రంలో సెలవు రోజుగా ప్రకటిస్తున్నట్లు ఆమె చెప్పారు. కేంద్రం కూడా దీన్ని పాటించాలని మమత ట్విట్టర్‌ ద్వారా సోమవారం సూచించారు. 

కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతో ఉన్నదని మమత చెప్పారు. వైరస్‌ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టిసారించామని తెలిపారు. అయితే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి సురక్షిత విధానాలు ఉత్తమ మార్గాలని పేర్కొన్నారు. దీంతో తమ ప్రభుత్వం మూడు కోట్ల మాస్కులను కొనుగోలు చేసి వంద రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని రంగాలవారికి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. 


logo