మంగళవారం 26 జనవరి 2021
National - Jan 04, 2021 , 16:33:23

జ‌న‌వ‌రి 23న జాతీయ సెల‌వు దినంగా ప్ర‌క‌టించండి : బెంగాల్ సీఎం

జ‌న‌వ‌రి 23న జాతీయ సెల‌వు దినంగా ప్ర‌క‌టించండి :  బెంగాల్ సీఎం

కోల్‌క‌తా:  జ‌న‌వ‌రి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతిని సెల‌బ్రేట్ చేసుకోనున్నారు. అయితే ఆ రోజున జాతీయ సెలువు దినంగా ప్ర‌క‌టించాల‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ డిమాండ్ చేశారు.స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత నేతాజీకి ఏమీ చేయ‌లేకపోయిన‌ట్లు తాను వ్య‌క్తిగ‌తంగా ఫీల‌వుతున్నాన‌ని, అందుకే జ‌న‌వ‌రి 23వ తేదీని సెలువు దినంగా ప్ర‌క‌టించాల‌ని దీదీ అన్నారు. ఈ మేర‌కు కేంద్రానికి లేఖ రాసిన‌ట్లు ఆమె తెలిపారు. ఆ రోజున రాష్ట్రంలో దేశ్ నాయ‌క్ దివ‌స్‌ను జ‌రుపుకోనున్నారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌కు చెందిన అన్ని ర‌హ‌స్య ఫైల్స్‌ను డీక్లాసిఫై చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. logo