గురువారం 02 జూలై 2020
National - Jun 23, 2020 , 13:11:55

గురువారం తేలనున్న సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ

గురువారం తేలనున్న సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ

ఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌(సీబీఎస్‌ఈ) 12వ తరగతి పెండింగ్‌ పరీక్షలను నిర్వహించేది లేనిది గురువారం నాడు వెల్లడించనున్నట్లు సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ  బోర్డు నేడు తెలిపింది. సీబీఎస్‌ఈలో 12వ తరగతి పరీక్షలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. పరీక్షలను రద్దు చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో విద్యార్థుల తల్లిదండ్రుల పిటిషన్లు దాఖలు చేశారు. నేటి విచారణ సందర్భంగా పరీక్షలపై చర్చలు ముగింపు దశలో ఉన్నాయని సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. రేపు సాయంత్రానికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విన్నవించారు. దీంతో కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.


logo