మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 21:38:58

యూజీ, పీజీ పరీక్షల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

యూజీ, పీజీ పరీక్షల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

బెంగళూరు : యూజీ, పీజీ కోర్సులతోపాటు ప్రొఫెషనల్‌ కోర్సులకు చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయిస్తూ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇంటర్మీడియట్ సెమిస్టర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై చదువులకు ప్రమోట్ చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌లోగా పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యా శాఖకు కర్ణాటక సర్కార్ సూచించింది. ఈ మేరకు 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ పరీక్షలను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలు తాత్కాలికంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని, ఆ తర్వాత కేంద్రం, యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి అక్టోబర్ 1 నుంచి లేదా.. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో తరగతులను నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo