బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 07:04:11

16లోగా వాడకపోతే అంతే సంగతి

16లోగా వాడకపోతే అంతే సంగతి

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం మీ దగ్గరున్న డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఇప్పటిదాకా వాడకపోయినైట్లెతే ఇకపై అవి పనిచేయవు. అవును.. ఈ నెల 16 నుంచి ఇంతే మరి. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు లావాదేవీల భద్రత పెంపులో భాగంగా ఈ ఏడాది జనవరి 15న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో మార్చి 16లోగా వినియోగించని కార్డులను నిరుపయోగంగా చేయాలని బ్యాంకర్లను, కార్డు మంజూరుదారులను ఆర్బీఐ ఆదేశించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీ ఆధారంగా డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులు పనిచేస్తాయి. ఏటేటా డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు పెరిగిపోతుండగా, ఈ సేవల్లో ఎలాంటి మోసాలకు తావులేకుండా వినియోగదారుల కోసం ఆర్బీఐ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది.


logo