బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 16:57:19

కరోనా ఎఫెక్ట్.. ఎన్నిసాైర్లెనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు..

కరోనా ఎఫెక్ట్.. ఎన్నిసాైర్లెనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక నిర్ణయాలు..

న్యూఢిల్లీ : కరోనా కోరల్లో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాల్ని తీసుకున్నది. డెబిట్‌ కార్డుదారులు ఇక నుంచి ఇతర ఏటీఎంల నుంచి ఎన్నిసార్లు అయినా నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ అవకాశం వచ్చే మూడు నెలల దాకా అందుబాటులో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వను ఉంచాలనే అంశంలో ఎలాంటి నియంత్రణ ఉండదు. ఇకపై బ్యాంకింగ్‌ ఛార్జీలను కూడా తగ్గిస్తారు. ఆధార్‌- పాన్‌ కార్డు అనుసంధానికి తుది గడువును 2020 జూన్‌ 30 దాకా పొడిగించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఆదాయపన్నుపై ఆలస్యమయ్యే చెల్లింపులపై విధించే వడ్డీ రేటును పన్నెండు శాతం నుంచి తొమ్మిది శాతానికి తగ్గించారు.  

మార్చి, ఏప్రిల్‌, మే నెలల జీఎస్టీ రిటర్నులను దాఖలు చేసే గడువును 2020 జూన్‌ 30 వరకూ పొడిగించారు. రూ.5 కోట్లు లేదా అంతకంటే తక్కువ టర్నోవరు గల సంస్థలు జీఎస్టీ దాఖలును ఆలస్యం చేసినా ఎలాంటి ఆలస్య రుసుము కానీ జరిమానా కానీ విధించరు. రూ.5 కోట్లు లేదా అంతకంటే అధిక టర్నోవరు గల సంస్థలపై నుంచి కేవలం తొమ్మిది శాతమే వడ్డీని వసూలు చేస్తారు. లాక్‌ డౌన్‌లో ఎగుమతిదారులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు కస్టమ్స్‌ శాఖ ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుందని ఆర్థికమంత్రి వెల్లడించారు.


logo
>>>>>>