మంగళవారం 31 మార్చి 2020
National - Feb 16, 2020 , 14:47:20

కోవిడ్‌‌-19: 1,600 దాటిన కరోనా మృతుల సంఖ్య

కోవిడ్‌‌-19: 1,600 దాటిన కరోనా మృతుల సంఖ్య

దేశ వ్యాప్తంగా వ్యాధి సోకిన వారి సంఖ్య 68వేలు దాటిందని చైనా వివరించింది.

బీజింగ్‌: కరోనా వైరస్‌(కోవిడ్‌‌-19) వ్యాప్తితో చైనాలో రోజురోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది.  ఆదివారం ఒక్కరోజే 142 మంది చనిపోవడంతో వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య  1,665కు చేరింది.  కరోనా వైరస్   బారినపడుతున్న వారి సంఖ్య వరుసగా మూడో రోజు తగ్గిందని అధికారులు చెబుతున్నారు.  నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 2,009 కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

శనివారం వరకు 9,419 మంది పేషంట్లు కోలుకున్నారని వారిని డిశ్చార్జ్‌ చేశామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒక్క శనివారమే 1,323 మంది వైరస్‌ నుంచి కోలుకొని తమ ఇళ్లకు వెళ్లినట్లు కమిషన్‌ తెలిపింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ కరోనా నమోదు కేసుల  సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. దేశ వ్యాప్తంగా వ్యాధి సోకిన వారి సంఖ్య 68వేలు దాటిందని చైనా వివరించింది. 


logo
>>>>>>