బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 12:00:07

ఢిల్లీ అల్ల‌ర్లు.. 34కు చేరిన మృతుల సంఖ్య‌

ఢిల్లీ అల్ల‌ర్లు.. 34కు చేరిన మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌:  ఢిల్లీ మ‌త‌ఘ‌ర్ష‌ణ‌ల్లో మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరుకున్న‌ది.  ఈశాన్య ఢిల్లీలో గ‌త మూడు రోజుల క్రితం .. సీఏఏ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా మూడు రోజుల పాటు రెండు వ‌ర్గాలు కొట్టుకున్నాయి. ఆ సంఘ‌ట‌న‌ల్లో మ‌ర‌ణించిన వారి సంఖ్య 34కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది.  మ‌రో 200 మంది గాయ‌ప‌డ్డారు.  ఆదివారం సాయంత్రం అల్ల‌ర్లు ప్రారంభం అయ్యాయి. తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన రెండు వ‌ర్గాలు.. స్థానికంగా ఉన్న షాపులు, ఇండ్లు, వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు.  ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకున్నారు.  జ‌ఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌, బాబ‌ర్‌పుర్‌, య‌మునా విహార్‌, చాంద్ భాగ్‌, శివ్ విహార్ ప్రాంతాల్లో హింస హెచ్చు స్థాయిలో జ‌రిగింది.  జీటీబీ హాస్ప‌ట‌ల్‌లో ఇవాళ అయిదుగురు చనిపోయారు, దాంతో మృతుల సంఖ్య పెరిగిన‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. చాంద్‌భాగ్‌లో డ్రైనేజీలో బుధ‌వారం ఐబీ ఆఫ‌స‌ర్ శ‌వాన్ని వెలికితీశారు.logo